జగన్ చర్యలను బీజేపీ ఎప్పటికీ సమర్థించదు.. చంద్రబాబుకు న్యాయం జరిగేలా చూస్తాం: ఆదినారాయణరెడ్డి
Amaravati: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు పీటీ వారెంట్ పై దర్యాప్తు చేయొద్దని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై సీఐడీ కౌంటర్ దాఖలు చేయగా తుది వాదనలు ఈ నెల 18వ తేదీకి వాయిదా పడ్డాయి. అయితే, చంద్రబాబు ఆరెస్టు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలను బీజేపీ సమర్థించబోదని బీజేపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి అన్నారు.
BJP vice-president Adinarayana Reddy: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు పీటీ వారెంట్ పై దర్యాప్తు చేయొద్దని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై సీఐడీ కౌంటర్ దాఖలు చేయగా తుది వాదనలు ఈ నెల 18వ తేదీకి వాయిదా పడ్డాయి. అయితే, చంద్రబాబు ఆరెస్టు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలను బీజేపీ సమర్థించబోదని బీజేపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి అన్నారు.
వివరాల్లోకెళ్తే.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించిన బీజేపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి.. దీనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. జగన్ సర్కారు తీరుపై మండిపడ్డారు. ఆదివారం ప్రొద్దుటూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో జగన్ చేసిన చర్యను బీజేపీ ఎప్పటికీ సమర్థించబోదని అన్నారు. ఈ విషయంలో చంద్రబాబుకు న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇదిలావుండగా, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 18కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. అలాగే, పీటీ వారెంట్‌పై తదుపరి విచారణ జరిగే వరకు దర్యాప్తు మానుకోవాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ కౌంటర్ దాఖలు చేసి, తుది వాదనలు ఈ నెల 18కి వాయిదా వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేసులో గత ప్రభుత్వ హయాంలో స్కాం నమోదు చేసి అక్రమాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు పేరును చేర్చారు.
అలాగే, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌లో బీజేపీ పాత్ర లేదని ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ డీ పురందేశ్వరి ఇప్పటికే స్పష్టవ చేశారు. బీజేపీపై ఆరోపణలు అనవసరంగా మీడియాలో ప్రచారంలో ఉన్నాయని ఆమె అన్నారు. బీజేపీ ప్రమేయం ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఎలా కలుస్తారని ఆమె ప్రశ్నించారు. "మా స్టాండ్ చాలా స్పష్టంగా ఉంది. చంద్రబాబు నాయుడు అరెస్టులో బీజేపీ హస్తం లేదు. కొంతమంది విజిల్‌బ్లోయర్లు ఫిర్యాదు చేయడంతో..సీఐడీ విచారించి (నాయుడు) అరెస్టు చేసిందని" తెలిపారు.
లోకేష్‌తో భేటీ సందర్భంగా అమిత్ షా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం గురించి ఆరా తీశారనీ, ఆయన కేసు వివరాలను కూడా తీసుకున్నారని ఆమె తెలిపినట్టు పీటీఐ పేర్కొంది. లోకేష్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బీజేపీ చీఫ్‌లు పురంధేశ్వరి, కిషన్‌రెడ్డి కూడా న్యూఢిల్లీలో అమిత్‌షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల పొత్తుల అంశం హాట్ టాపిక్ గా మారింది.