ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల మీద సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతిస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విజయవాడలో తెలిపారు. 

"

పంచాయతీ ఎన్నికలు జరిగితే పాలకవర్గాలు ఏర్పడతాయి. అప్పుడే కేంద్రం నుండి భారీగా నిధులు వస్తాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో  బీజేపీ,జనసేన మద్దతు దారులు విజయం సాధిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికలు శాంతియుతంగా జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. గతంలో జరిగిన ఏన్నికకు సంబందించి ఏకగ్రీవాలు రద్దుచేసి ఎన్నిక జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. 

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిరంతర ప్రక్రియ. అది జరగాలని ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ సంయుక్తంగా మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పుకొచ్చారు..