Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ సిఎం రమేష్: పావులు కదుపుతున్న బిజెపి

  • క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
Bjp targets naidus close aid cm ramesh projects

తెలుగుదేశం పార్టీలోని కీలక నేతల ఆదాయామార్గాలపై బిజెపి బాణం ఎక్కుపెట్టిందా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబునాయుడుకు సన్నిహితంగా ఉంటూ పార్టీకి ఆర్ధికంగా అండదండలు అందిస్తున్న నేతల సంపాదన మార్గాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ముందుగా సిఎం రమేష్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది.

మూడున్నరేళ్ళ క్రితం వరకూ సిఎం రమేష్ ప్రాజెక్టులు ఆర్ధికంగా పెద్ద చెప్పుకోదగ్గ స్ధాయిలో లేవు. ఎప్పుడైతే టిడిపి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి రమేష్ ప్రాజెక్టులు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ప్రధానంగా రాయలసీమలోని గాలేరు-నగిరి, హంద్రీ-నీవా, వంశధార ఇరిగేషన్ తదితర ప్రాజెక్టుల పనులు చేస్తున్నారు.

సిఎం రమేష్ పై ఉన్న ప్రధానమైన ఆరోపణలేమిటంటే, అప్పటి వరకూ ఉన్న ప్రాజెక్టల అంచనాలను పెంచేసి డబ్బులు  చేసుకున్నారనేది. ఇదే విషయమై బజెపిలోని రాయలసీమ నేతలు కొందరు ప్రత్యేకంగా క్షేత్రస్ధాయి పరిశీలన జరిపారు. ప్రాజెక్టుల పనులు జరుగుతున్న తీరు, వాస్తవ అంచనాలు, చెల్లించిన బిల్లులు, పెండింగ్ లో ఉన్న పనులు, బిల్లులు లాంటి అన్ని విషయాలపైనా పూర్తి సమాచారం సేకరించారు. ప్రాజెక్టుల ముసుగులో భారీ అవినీతి జరుగుతోందన నిర్ధారణకు వచ్చారు.

సేకరించిన ఆధారాల ప్రకారం ఓ నివేదిక తయారు చేశారు. పార్టీలోని ప్రజాప్రతినిధులకు అందచేశారు. అసెంబ్లీలో లేవనెత్తాలని అనుకున్నారు. అందుకే సిఎం రమేష్ ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేయనున్నారు. ఒకవైపు అసెంబ్లీలో లేవనెత్తుతూనే ఇంకోవైపు విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేయాలని బిజెపి ప్రజా ప్రతినిధులు నిర్ణయించారు. మిత్రపక్షం డిమాండ్ చేసినంత మాత్రాన తన సన్నిహితునిపై ఆరోపణలు చేయటానికి, విజిలెన్స్ విచారణకు చంద్రబాబు అంగీకరిస్తారా? చూడాల్సిందే ఏం జరుగుతుందో?

Follow Us:
Download App:
  • android
  • ios