పొత్తు తెంపుకుని గంటలు కూడా గడవక ముందే చంద్రబాబునాయుడుపై బిజెపి భయంకరమైన ముద్ర వేసింది. తనకు తాను 40 ఏళ్ళ అనుభవజ్ఞడనని చెప్పుకుంటన్న చంద్రబాబు ఉత్త అసమర్ధ ముఖ్యమంత్రిగా బిజెపి అభివర్ణించింది. రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్న చంద్రబాబుకు ఇంతకన్నా ఘోరమైన అవమానం ఏముంటింది? అందునా శుక్రవారం ఉదయం వరకూ మిత్రపక్షంగా ఉన్న బిజెపినే అసమర్ధ ముఖ్యమంత్రి ముద్ర వేయటం చాలా ఘోరమే.

రాజకీయాలన్నాక ఒక పార్టీని మరో పార్టీ విమర్శించుకోవటం చాలా సహజం. కానీ మిత్రపక్షంగా ఉన్న పార్టీనే చంద్రబాబుపై అంతటి ముద్ర వేయటం దారుణంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే తాను చేసిన తప్పులన్నింటినీ బిజెపిపై మోపటానికి ప్రయత్నిస్తున్నట్లు బిజెపి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జవిఎల్ నరసింహారావు ఆరోపించటం గమనార్హం.

ఎన్డీఏలో నుండి చంద్రబాబు వెళ్ళిపోవటం మంచి పరిణామంగా ఆయన వర్ణించటం చూస్తుంటే చంద్రబాబు ఎప్పుడెళ్ళిపోతారా అని ఎదురు చూస్తున్నట్లుంది. గడచిన మూడున్నరేళ్ళల్లో తనను తాను అసమర్ధ సిఎంగా చంద్రబాబు ప్రూవ్ చేసుకున్నట్లు జివిఎల్ తీర్మానించేశారు. రేపటి నుండి తామేంటో చంద్రబాబుకు రుచిచూపిస్తామంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు. అంటే చంద్రబాబుకు ‘ముందున్నది మొసళ్ళ పండగేనా’?