తిరుపతి లోకసభ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ?
తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా రత్నప్రభను బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇవాళ కానీ రేపు కానీ రత్నప్రభ పేరును బీజేపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
తిరుపతి: తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా రత్నప్రభను బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇవాళ కానీ రేపు కానీ రత్నప్రభ పేరును బీజేపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
గత ఏడాదిలో అనారోగ్యంతో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
ఈ స్థానం నుండి పోటీ చేసే టీడీపీ, వైసీపీ అభ్యర్ధులను ఆ పార్టీ అధిష్టానాలు ఇప్పటికే ప్రకటించాయి. టీడీపీ నుండి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, వైసీపీ నుండి డాక్టర్ గురుమూర్తిలు బరిలోకి దిగనున్నారు.
బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు. కర్ణాటక క్యాడర్ కు చెందిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రత్నప్రభను తిరుపతి ఎంపీ స్థానం నుండి బరిలోకి దింపాలని బీజేపీ నాయకత్వం బావిస్తోంది.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆమె రిటైరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ సెక్రటరీగా కూడ ఆమె పనిచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైరైన తరవాత ఆమె బీజేపీలో చేరారు.
ఏపీ రాష్ట్రంలో పనిచేసిన అనుభవం ఉండడంతో రత్నప్రభను తిరుపతి ఎంపీ స్థానం నుండి బరిలోకి దింపాలని బీజేపీ నాయకత్వం ప్లాన్ చేసింది. రత్నప్రభ కంటే ముందుగా మరో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి పేరును కూడ బీజేపీ నాయకత్వం పరిశీలించింది. చివరికి రత్నప్రభ వైపే బీజేపీ మొగ్గు చూపినట్టుగా చెబుతున్నారు.
త్వరలోనే రత్నప్రభ పేరును బీజేపీ నాయకత్వం ప్రకరటించే అవకాశం ఉంది.