తిరుపతి: తిరుపతి ఎంపీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధులను టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ (వైసీపీ)లు ప్రకటించాయి. బీజేపీ ఇంకా అభ్యర్ధిని ప్రకటించాల్సి ఉంది.

తిరుపతి ఎంపీ  బల్లి దుర్గాప్రసాద్ గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.

2019 ఏప్రిల్ లో తిరుపతి ఎంపీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఉప ఎన్నికల్లో కూడ పనబాక లక్ష్మి మరోసారి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు.

ఈ స్థానం నుండి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తిని  ఆ పార్టీ బరిలోకి దింపనుంది. జగన్ పాదయాత్రలో డాక్టర్ గురుమూర్తి కీలకంగా వ్యవహరించారు. ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో గురుమూర్తిని ఆ పార్టీ బరిలోకి దింపుతున్నట్టుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.

ఇదే స్థానం నుండి బీజేపీ, జనసేన కూటమి అభ్యర్ధి బరిలోకి దిగనున్నారు. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధి బరిలోకి దింపనుంది. అయితే బీజేపీ ఎవరిని అభ్యర్ధిగా దింపుతోందోననే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.