ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తోందని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 110 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. 

ఏపీ ప్రజలు చంద్రబాబు ను తిరస్కరించారని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రజల తిరస్కరణకు గురయ్యారని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు అంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. 

ఇప్పటి వరకు చంద్రబాబు ఏపీ ప్రజలను మోసగించారని ఇక మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఇప్పటికే ప్రజలు చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేశారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే అన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా చెప్తున్నాయని వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని మురళీధర్ రావు స్పష్టం చేశారు.