బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ సమయంలో రోగుల అంబులెన్స్‌లను తెలంగాణకు రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని ..కేసీఆర్‌కు ఏపీలో బ్యానర్లు కట్టడం ఏంటని టీజీ వెంకటేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం.. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారని, ఇప్పుడేమో వైజాగ్ అనడంపై వెంకటేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధుల్లాగే రాయలసీమ నేతలు కూడా రాజధాని కోసం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బీజేపీదేనని వెంకటేశ్ గుర్తుచేశారు. దేశంలో అవినీతి రహిత, స్వచ్ఛమైన పాలన మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అందిస్తోందని.. ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ భారతీయులను రక్షించేందుకు మోడీ ఎంతో కృషి చేశారని టీజీ ప్రశంసించారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధికి పట్టం కట్టాలని ఆయన కోరారు.
ఇకపోతే.. బీఆర్ఎస్ గురించి టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ.. కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు వెళ్తున్నాడని... ఆ పార్టీ గాలిలో కొట్టుకుపోక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. పేరు మార్చినంత మాత్రాన బీఆర్ఎస్... బీజేపీకి సమానం కాదన్నారు. రాయలసీమ ప్రాజెక్ట్‌లు అడ్డుకున్న కేసీఆర్‌కు ఏపీలో బ్యానర్లు కట్టడం ఏంటని టీజీ వెంకటేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో రోగుల అంబులెన్స్‌లను తెలంగాణకు రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని ఆయన గుర్తుచేశారు. రాహుల్ గాంధీ ఏపీలో పర్యాటించాలంటే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీజీ వెంకటేశ్ డిమాండ్ చేశారు.
ALso REad:మూడు రాజధానులకు మద్ధతుగా ర్యాలీ.. బైక్‌పై నుంచి పడ్డ వైసీపీ ఎమ్మెల్యే, ఆసుపత్రికి తరలింపు
మరోవైపు... వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్రలో నిర్వహిస్తున్న సమావేశాల్లో మంత్రులు, వైసీపీ నాయకులు పాల్గొంటున్నారు. అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ రాజధాని కోసం రాజీనామా చేయడానికి సిద్దమేనని ప్రకటనలు చేస్తున్నారు. శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన మంత్రి ధర్మాన ప్రసాదరావు.. విశాఖకు రాజధాని రాకుండా చేసే వారిని శత్రువులుగా చూడాలని అన్నారు. సీఎం జగన్, ప్రజలు అనుమతిస్తే రాజీనామా చేసి ఉద్యమానికి వెళ్లిపోదామనే ఆలోచన ఉందని చెప్పారు.
ఇదిలా ఉండగా.. వికేంద్రీకరణకు మద్దతుగా రాజీనామాలకు సిద్దమని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేడు ప్రకటించారు. వికేంద్రీకరణకు మద్దతుగా ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ అధ్యక్షతన వివాఖలోని హోటల్ మేఘాలయాలో శనివారం నాన్ పొలిటికల్ జేఏసీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ, పలువురు ఫ్రొఫెసర్లు, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజీనామాకు సిద్దంగా ఉన్నట్టుగా అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ ప్రకటించారు. కరణం ధర్మశ్రీ మరో అడుగు ముందుకు వేసి.. స్పీకర్ ఫార్మాట్‌లో ఉన్న తన రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా అమరావతి రైతులు వ్యతిరేకిస్తే.. తాము కూడా అమరావతికి వ్యతిరేకమేనని అన్నారు. వికేంద్రీకరణ కోసం తాను రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. దమ్ముంటే వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేయాలని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడుకు సవాలు విసిరారు. అమరావతికి మద్దతు నినాదంతో టెక్కలి నుంచి తిరిగి పోటీ చేయాలని అన్నారు.
