అమరావతి తరలింపును నిరసిస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళన రేపటికి 200 రోజులకు చేరుకుంది. ఈ క్రమంలో శనివారం ఆన్‌లైన్‌లో రాజకీయ పార్టీల ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు.

వర్చువల్‌లో నేతలు, రాజధాని రైతుల నిరసన తెలపనున్నారు. ఈ క్రమంలో రైతులకు చంద్రబాబు, సుజనా, పవన్, రామకృష్ణ, సీతారాం ఏచూరి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. రాజధాని తరలింపు నిర్ణయం ఏపీ చరిత్రలో ఒక చీకటి రోజన్నారు.

200 రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒక్కో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు.. ఒక్కో జిల్లాలో రాజధాని అంటే కుదరదని సుజనా స్పష్టం చేశారు.

రాజధాని అంగుళం కూడా కదలదని.. రైతులు ఆందోళన చెందవద్దని ఆయన హామీ ఇచ్చారు. కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని సుజనా చెప్పారు. అమరావతిపై బీజేపీ చేసిన తీర్మానానికి కట్టుబడి ఉందన్నారు.