‘టీడీపీ గాలి.. కాంగ్రెస్ వైపు మళ్లుతోంది’

First Published 25, May 2018, 3:46 PM IST
bjp MP haribabu says tdp wants to merge with congress
Highlights

బీజేపీ నేత హరిబాబు

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ చెట్టపట్టాలు వేసుకుని తిరగడంతో ఎన్టీఆర్ ఆత్మ  క్షోభిస్తోందని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు అన్నారు.
 కర్నాటక పరిణామాలను అంతా గమనిస్తున్నారని ఆయన చెప్పారు.కాంగ్రెస్ వ్యతిరేకతతో పుట్టిన పార్టీ ఇప్పుడు ఇలా ఆ పార్టీ నేతలతో కలవాలనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. 

ప్రస్తుతం టీడీపీ దారి.. కాంగ్రెస్ వైపు మళ్లుతోందని విమర్శించారు. మోడీ సహకారంతో ఒక పక్క అబివృద్ది చేస్తూ మరో పక్క ఆయనపైనే నిందలు మోపుతున్నారని హరిబాబు మండిపడ్డారు.
 ప్రత్యేక హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్రం రూ.43వేల కోట్ల నిధులను ఐదేళ్లలో ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. విభజన చట్టంలో 
పొందుపర్చిన అంశాలను 85 శాతం వాస్తవ రూపం దాల్చాయని హరిబాబు చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గ్రాఫ్ తగ్గుతుంది అనేది కేవలం భ్రమేనని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో ఎన్డీయే గెలిచి మళ్లీ నరేంద్రమోదీ ప్రధానమంత్రి అవుతారని హరిబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

loader