Asianet News TeluguAsianet News Telugu

నాయకత్వం స్వయంగా ప్రకాశించాలి.. రుద్దుడు కార్యక్రమాలొద్దు : లోకేష్ పాదయాత్రపై జీవీఎల్ సంచలనం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రుద్దుడు కార్యక్రమంలో నాయకత్వం డెవలప్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

bjp mp gvl narasimharao sensational comments on nara lokesh padayatra
Author
First Published Feb 5, 2023, 4:25 PM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాదయాత్రపై  పాజిటివ్ న్యూస్ కంటే నెగిటివ్ న్యూస్ ఎక్కువగా వుంటోందని దుయ్యబట్టారు. నాయకత్వం అనేది స్వయంగా ప్రకాశించాలని జీవీఎల్ అన్నారు.పార్టీకి ఉత్తరాధికారి లాంటి వ్యక్తికి మీడియాలో విస్తృతంగా ప్రచారం లభించడంలో ఆశ్చర్యం లేదని నరసింహారావు పేర్కొన్నారు. రుద్దుడు కార్యక్రమంలో నాయకత్వం డెవలప్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారని.. లోకేష్ పాదయాత్ర స్థానికంగానూ పెద్దగా హల్ చల్ చేస్తున్నట్లుగా తనకు అనిపించడం లేదని జీవీఎల్ పేర్కొన్నారు. 

ఇక ఎవరెన్ని చెప్పినా  జనసేనతోనే  పొత్తు ఉంటుందని  బీజేపీ ఎంపీ  జీవీఎల్ నరసింహరావు  స్పష్టం చేశారు. ఆదివారం నాడు  విశాఖపట్టణంలో  జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. సచివాలయం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని ఆయన  చెప్పారు. వైజాగ్  మెట్రో ఆలస్యం కావడానికి  ప్రభుత్వ ఉదాసీనతే కారణంగా ఆయన పేర్కొన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న  ఎంపీలకు  అవగాహన  అవసరమని జీవీఎల్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉంది. అయితే  ఇటీవల  భీమవరంలో  జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో  భావసారూప్యత గల పార్టీలతో  పొత్తు ఉంటుందని  బీజేపీ  తీర్మానం  చేసింది.  

ALso REad: ఎవరెన్ని చెప్పినా జనసేనతో పొత్తు: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు

జనసేనతో పొత్తు  విషయమై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు జనంతో పొత్తు... కుదిరితే  జనసేనతో  పొత్తు ఉంటుందని వీర్రాజు చెప్పారు.   ఈ వ్యాఖ్యలపై  జీవీఎల్ నరసింహరావు  స్పందించారు. జనసేనతో  పొత్తు ఉంటుందన్నారు. ఏపీ రాష్ట్రంలో టీడీపీతో  పొత్తు ఉంటుందనే  రీతిలో  జనసేన సంకేతాలు ఇచ్చిందని  రాజకీయ పరిశీలకులు  చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో  వైసీపీ  ప్రభుత్వం ఏర్పడకుండా  తాను ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే  ప్రభుత్వ వ్యతిరేక  ఓటు చీలకుండా  తాను తన శక్తివంచన లేకుండా  ప్రయత్నాలు  చేస్తానని  తెలిపారు. తన ప్రతిపాదనపై అన్ని పార్టీలు ఆలోచించాలని ఆయన  కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios