విశాఖపట్నంలో భూభాగోతాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఈ నెల 11న లేఖ రాసినట్టుగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. 22ఏ కింద ఉన్న భూముల విషయమై నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరినట్టుగా చెప్పారు.
విశాఖపట్నంలో భూభాగోతాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఈ నెల 11న లేఖ రాసినట్టుగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. 22ఏ కింద ఉన్న భూముల విషయమై నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరినట్టుగా చెప్పారు. ఆదివారం విశాఖపట్నంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహా రావు మీడియాతో మాట్లాడారు. జీవీఎల్ మాట్లాడుతూ.. బీజేపీ కారణంగానే 22ఏ భూముల వ్యవహారంలో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని అన్నారు. విశాఖ భూముల వ్యవహారంలో టీడీపీ, వైసీపీ నేతల పాత్ర ఉందని ఆరోపించారు. రెండు పార్టీలు కుమ్మకై సిట్ నివేదికను బహిర్గతం చేయలేదని విమర్శించారు. విశాఖ భూముల వ్యవహారంలో సిట్ నివేదికలను బయటపెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు.
సోము వీర్రాజు మాట్లాడుతూ.. విశాఖలో భూందాలకు పాల్పడినవారిపై సిట్ వేశారని చెప్పారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు సిట్ నివేదికలను ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు. నిందితులతో రెండు పార్టీలు కుమ్మక్కవడం వల్లే నివేదికలు బయటకు రావడం లేదని విమర్శించారు. విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించి విజయవాడలో పవన్ కల్యాణ్‌ను కలిసి సంఘీభావం తెలిపామని గుర్తుచేశారు. ఈ ఘటనపై బీజేపీ అధిష్టానం ఆగ్రహంగా ఉందని చెప్పారు. సరైన సమయంలో చర్యలు ఉంటాయని అన్నారు.
