అమరావతి: టీడీపీపై బీజేపీఎంపీ జీవీఎల్ నరసింహరావు మరోసారి విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా జీవిఎల్ ఆరోపణలు చేశారు.

టీడీపీ టోటల్‌గా దొంగల పార్టీగా మారిందని జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. శుక్రవారం సాయంత్రం జీవీఎల్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఆంధ్రా ప్రజల నోట్లో మట్టికొట్టి జేబులు నింపుకొన్న చంద్రబాబు ఎదుట నిరసనలు చేపడుతామన్నారు.

లక్షల కోట్ల అవినీతి చేసిన చంద్రబాబను నిలదీస్తామని చెప్పారు. అధికార అహంకారానికి ఎన్నికల ఓటమితో పాటు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని తన ట్వీట్‌లో జీవీఎల్ అభిప్రాయపడ్డారు.