ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు ఇస్తున్నట్టుగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. 

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రజాస్వామ్యబద్దంగా జరగలేదనేది BJP అభిప్రాయమని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు చెప్పారు.బుధవారం నాడు న్యూఢిల్లీలో బీజేపీ ఎంపీ GVL Narasimha Rao మీడియాతో మాట్లాడారు. తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు ప్రాంతీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కేంద్రంపై నిందలు వేసి తప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. అబద్దాలు ప్రచారం చేసే పార్టీలు చర్చకు సిద్దంగా ఉండాని ఆయన సవాల్ విసిరారు.

Andhra Pradeshకి 2015 -16 లో రూ. 27,990 కోట్ల నిధులిస్తే 2020-21 మూడు రెట్లు అదికంగా అంటే రూ. 77,538 కోట్లు కేంద్రం ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఆరేళ్లలో ఇన్ని నిధులు ఏ రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు.ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 15 వేల కోట్ల రుణాన్ని కేంద్రం చెల్లిస్తోందని జీవీఎల్ నరసింహారావు చెప్పారు.