విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక కామెంట్స్..
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు కీలక ప్రకటన చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు కీలక ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పారు. ఇప్పట్లో ప్రైవేటీకరణ జరిగే అవకాశం లేదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్‌లో కొనసాగాలంటే లాభాల బాట పట్టించాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి..దానిని పరిరక్షణ అందరి బాధ్యత అని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజలందరి ఆస్తి అని పేర్కొన్నారు.