రాజ్యసభ హౌస్ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ హోదాలో ఢిల్లీలో ఎంపీలకు ప్రభుత్వ బంగళాల కేటాయింపు, వాటి నిర్వహణ బాధ్యతలను రమేశ్ పర్యవేక్షించనున్నారు.
రాజ్యసభ హౌస్ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు హౌస్ కమిటీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో సీఎం రమేశ్ సమీక్ష నిర్వహించారు. రాజ్యసభ హౌస్ కమిటీ ఛైర్మన్ హోదాలో ఢిల్లీలో ఎంపీలకు ప్రభుత్వ బంగళాల కేటాయింపు, వాటి నిర్వహణ బాధ్యతలను రమేశ్ పర్యవేక్షించనున్నారు.
కాగా... రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్.. సభకు సంబంధించిన అనేక కమిటీలను పునర్నిర్మించిన సంగతి తెలిసిందే. అలాగే వాటికి నూతన అధ్యక్షులను నియమించారు. ఈ క్రమంలోనే సీఎం రమేష్‌ను కీలక పదవి వరించింది. రాజ్యసభ హౌసింగ్ కమిటీ చైర్మన్‌గా సీఎం రమేష్ నియమితులయ్యారు. మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్‌కు రాజ్యసభ ఎథిక్స్ కమిటీ చైర్‌పర్సన్ పదవి లభించింది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌లను జారీ చేసింది.
ALso REad:బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు కీలక పదవి.. వివరాలు ఇవే..
ఇక, 2019 సార్వత్రికల ఎన్నికల అనంతరం సీఎం రమేష్.. టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎం రమేష్.. పదవీకాలం 2024 ఏప్రిల్ 2తో ముగియనుంది. దాదాపు పదేళ్లుగా ఆయన ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. రాజ్యసభ పిటిషన్‌ల కమిటీకి బీజేపీ ఎంపీ సుజీత్ కుమార్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ప్రభుత్వ హామీల కమిటీకి చైర్మన్‌గా డీఎంకే ఎంపీ ఎం తంబిదురై, కమిటీ ఆన్ పేపర్స్ లెయిడ్ ఆన్ ది టేబుల్ కు చైర్మన్‌గా బీజేపీ ఎంపీ కామాఖ్య ప్రసాద్ తాసా నియమితులయ్యారు. సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీకి రాజ్యసభలో బీజేపీ చీఫ్ విప్‌గా ఉన్న లక్ష్మీకాంత్ బాజ్‌పేయి అధ్యక్షత వహించనున్నారు.
