అమరావతి: ఏపీ రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఆయన అసెంబ్లీ ఆవరణలో  మీడియాతో మాట్లాడారు.

ఏపీలో బీజేపీ రానున్న ఐదేళ్లలో కచ్చితంగా బలపడనుందన్నారు. ఐదేళ్లుగా చంద్రబాబునాయుడు బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకొన్నారని సోము వీర్రాజు విమర్శించారు.  రాజకీయ విమర్శలే కాకుండా అధికారులతో కూడ బీజేపీని తిట్టించారని వీర్రాజును  ఆరోపించారు.

బీజేపీని నాశనం చేయడానికి అన్ని రకాలుగా చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేశారని  సోము వీర్రాజువిమర్శించారు.  ముఖ్యమంత్రి హోదాలో జగన్ కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడగడంలో తప్పేమీ లేదన్నారు.