విజయవాడ: పోలవరం అంచనాల పెంపులో అవినీతి చోటు చేసుకొందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. ఈ విషయమై కేంద్ర మంత్రి గడ్కరీకి ఫిర్యాదు చేసినట్టుగా ఆయన చెప్పారు.

ఆదివారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. సాంకేతికత పేరుతో పోలవరం అంచనాలను  భారీగా పెంచారని ఆయన ఆరోపించారు. వాస్తవ అంచనాల మేరకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోందని ఆయన చెప్పారు.

also read:బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభించిన కిషన్ రెడ్డి

గీతం వర్శిటీలో అక్రమాల విషయంలో ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే రాష్ట్రంలోని ఇతర అక్రమ నిర్మాణాల విషయంలో చేపట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి అక్రమ నిర్మాణాలపై ఒకే విధానాన్ని అవలంభించాలని ఆయన కోరారు.ప్రతిపక్షంపై కక్షసాధింపే ప్రభుత్వ విధానంగా కన్పిస్తోందని ఆయన ఆరోపించారు.ప్రజా వేదిక కూల్చివేత తర్వాత రాష్ట్రంలో ఏ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారో చెప్పాలని ఆయన కోరారు.