‘చంద్రబాబు వట్టి అమాయకుడు, ఇట్టే నమ్మేస్తాడు’

First Published 25, May 2018, 3:19 PM IST
BJP mla vishnukumar raju says chandrababu is innocent
Highlights

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు రాష్ట్రంలో, కేంద్రంలోని బీజేపీ నేతలు చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేస్తూ
ఆయనపై పలు ఆరోపణలు చేస్తుంటే.. విష్ణుకుమార్ రాజు మాత్రం ఆయనకు మద్దతుగా మాట్లాడారు. అంతేకాకుండా ఓ విలువైన సలహా కూడా ఇచ్చారు.

చంద్రబాబు వట్టి అమాయకుడు అన్నారు. ఎవరు ఏది చెప్పినా.. ఇట్టే నమ్మేస్తారని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. కొంత మంది టీడీపీ నేతలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు
కి జాగ్రత్తలు తెలిపారు. మహానాడు కార్యక్రమంలో.. టీడీపీ నేతలందరితో చంద్రబాబు ప్రమాణం చేయించాలని సూచించారు. అప్పుడు వారు పార్టీ మారే అవకాశం ఉండదని తెలిపారు.

మార్వాడీలపై కళా వెంకట్రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. మార్వాడీలకు కళా వెంకట్రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, వైసీపీ కలిసి పోతాయని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

loader