బిజెపి శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు చంద్రబాబునాయుడుపై పెద్ద బాంబే పేల్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి బిజెపి, టిడిపి మంత్రులు రాజీనామాలు చేసి బయటకు వచ్చేసిన తర్వాత ఇరు పార్టీల నేతలు గొంతులు పెద్దగానే వినబడుతున్నాయ్. ఈ నేపధ్యంలోనే బిజెపి ఎంఎల్ఏ విష్ణు మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రజలంతా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వైపే ఆకర్షితులవుతున్నట్లు చెప్పారు.

అంతటితో ఆగకుండా, జనాలు ఇపుడు చంద్రబాబును, తెలుగుదేశంపార్టీని నమ్మే పరిస్ధితి లేదని చెప్పారు. విష్ణు తాజాగా చేసిన వ్యాఖ్యలు టిడిపిలో పెద్ద చర్చగా మారింది. పైగా జగన్ సభలకు వస్తున్న జనాలను చూస్తే తనకు ఆశ్చర్యంగా ఉందని కూడా అన్నారు. విష్ణు చేసిన వ్యాఖ్యలు, మాట్లాడుతున్న మాటలు భవిష్యత్తులో దేనికి సంకేతాలో ఇటు బిజెపి అటు టిడిపిలో ఎవరికీ అర్ధం కావటం లేదు.