పరువు తీయకండి.. కవిత

First Published 24, May 2018, 10:43 AM IST
bjp mahila leader kavitha responds on ttd issue
Highlights

అలా చేసి.. పరువు తీస్తున్నారు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగుల వైఖరిని నటి, బీజేపీ మహిళా నేత కవిత ఖండించారు. శ్రీవారి ఆలయంలో టీటీడీ ఉద్యోగులు,అర్చకులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ సందర్భంగా కవిత గురువారమిక్కడ మాట్లాడుతూ.. ఇప్పటికే శ్రీవారి ఆలయ పరువు తీస్తున్నారని, నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టడం బాధ కలిగించిందన్నారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని ఆమె కోరారు.

కాగా ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వైఖరిని నిరసిస్తూ టీటీడీ ఉద్యోగులు ఈ నిరసన చేపట్టారు. ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా విమర్శలు చేస్తున్నారంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. మూడు రోజుల పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నారు.

loader