వైసీపీ అధికారంలోకి వచ్చాక పెరిగిన మత మార్పిడులు: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను బీజేపీ నేతలు బుధవారం నాడు కలిశారు.రాష్ట్రంలో శాంతి బద్రతల వైఫల్యాలపై గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చారు.
అమరావతి:రాష్ట్రంలో YCP అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాలపై దాడులు పెరిగాయని మాజీ మంత్రి బీజేపీ నేత Kanna Laxmi Narayana ఆరోపించారుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ Biswabhusan Harichandan ను ఏపీ బీజేపీ నేతలు బుధవారం నాడు కలిశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, శాంతి భద్రతల వైఫల్యాలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు బీజేపీ నేతలు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
వైసీపీ సర్కార్ హయంలో హిందూ మతం, హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా ఎక్కడా పోలీస్ యాక్షన్ తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో మత మార్పిడులు విచ్చల విడిగా జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలోని ఏడు ప్రధాన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు నెల్లూరు జిల్లాలో హనుమాన్ శోభాయాత్ర సమయంలో జరిగిన దాడి విషయంలో నిందితులపై అధికారులు చర్యలు తీసుకోలేదని బీజేపీ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు. నెల్లూరులో హనుమాన్ జయంతి శోభాయాత్రపై అటాక్ చేశారన్నారు.ఆత్మకూరు లో హిందూ ఏరియాలో మసీదు కడుతున్నారని అడిగితే తమ పారటీ జిల్లా ప్రెసిడెంట్ పై దాడి చేశారని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు.తెనాలి లో హిందూ మహిళని వేధింపులకు గురి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. శ్రీశైలం లో అన్యమత మతస్తులు అత్యధికంగా దుకాణాలు, ఇతరత్రా కలిగి ఉన్నారని నిరూపించినా చర్యలు లేవన్నారు.కాకినాడ జెఎన్ టియు లో ఇల్లీగల్ కనస్ట్రక్షన్ పై గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చామని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.
ఏపి లో అంబేద్కర్ రాజ్యాంగం పనిచేయడం లేదని బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.జగన్ రాజ్యాంగం మాత్రమే పనిచేస్తుందన్నారు.ఐపిసి సెక్షన్ల కన్నా జగన్ సెక్షన్లే నడుస్తున్నాయని ఆయన విమర్శించారు.
గోరంట్ల లో మహిళ ఆత్మహత్య చేసుకుందని పోస్టుమార్టం రాకముందే పోలీసులు వైసీపీ ఒత్తిడితో రిపోర్ట్ రాశారని ఆయన ఆరోపించారు.తమ పోరాటం వల్లే సెక్షన్లు మార్చారని ఆయన గుర్తు చేశారు.జగన్ అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు పెరిగాయన్నారు. గోరంట్ల సంఘటనలో డిఎస్ పి, స్థానిక పోలీసులను విధుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే బిజెపి పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొయ్యేవరకు అందరినీ కలుపుకొని పోరాటం కొనసాగిస్తామన్నారు.
అత్యాచార సంఘటన ల పై రాష్ట్ర హోంమంత్రి భాద్యత రాహిత్యం గా మాట్లాడుతున్నారని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లిన నిర్మల కిషోర్ చెప్పారు. ఈ విషయమై మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.చట్టాలు నిందితులకు చుట్టాలు గా మారుతున్నాయన్నారు.హోంమంత్రి ని బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు ఈ రాష్ట్రంలో మహిళల తరపున పోరాడరా? అని ఆమె షర్మిలను ప్రశ్నించారు. వైఎస్ షర్మిల ఎక్కడ. ఉన్నారు అని నిర్మలా కిషోర్ ప్రశ్నించారు.