కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన దీక్షపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ వ్యంగాస్త్రాలు  సంధించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ షుగర్ వ్యాధి గ్రస్తులు ఒకట్రెండు రోజులే తినకుండా ఉండలేరు..కానీ రమేష్ మాత్రం ఏకంగా 11 రోజులు ఆమరణ దీక్ష చేశారు. గ్రేట్ ..ఆయన దీక్షను ‘గిన్నిస్’ కెక్కించాల్సిందే నంటూ సెటైర్లు వేశారు.

 రమేష్ దొంగ దీక్ష వల్ల ప్రజల్లో దీక్షలపై  ఉన్న నమ్మకం సడలిపోయిందని విమర్శించారు. సీఎం రమేష్ పై విమర్శలు సంధించిన విష్ణుకుమార్ చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తడం గమనార్హం. ఏపీలో హోంగార్డుల కష్టాలు గుర్తించి వారి జీతాలు పెంచినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.