ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మత మార్పిడిని పాలకులే ప్రోత్సహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జ్ సునీల్ దియోధర్ (Sunil Deodhar) ఆరోపించారు. ఎస్సీ రిజర్వేషన్లతో పోటీ చేసి క్రైస్తవులుగా ఉన్నవారు రాజీనామా  చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  

ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిడిని పాలకులే ప్రోత్సహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జ్ సునీల్ దియోధర్ (Sunil Deodhar) ఆరోపించారు. శనివారం వాజపేయి 97వ జయంతి (atal bihari vajpayee birth anniversary) సందర్భంగా విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. వాజ్‌‌పేయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోనే సునీల్ దియోధర్‌తో పాటుగా, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భ:గా సునీల్ దియోధర్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి పరిపాలన విధానం.. నేటి పాలకులకు ఆదర్శమని అన్నారు. 

ఏపీలో హిందూ ఆలయాల ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్లతో పోటీ చేసి క్రైస్తవులుగా ఉన్నవారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత (Mekathoti Sucharita) మతపరమైన వ్యాఖ్యలు చేశారన్నారని అన్నారు. హోం మంత్రి సుచరిత వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. తాము అధికారంలోకి వస్తే మత మార్పిడిలకు వ్యతిరేకంగా బిల్లు తెస్తామని చెప్పారు. ఏపీలో ఓటు బ్యాంకు రాజకీలే లక్ష్యంగా పాలన కొనసాగుతుందని విమర్శించారు. 

Scroll to load tweet…

Also Read: రామతీర్ధం ఘ‌ట‌న‌లో వైసీపీ, టీడీపీలదే బాధ్య‌త.. బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ఫైర్

ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశ వ్యాప్తంగా యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు, పెరిగాయని సునీల్ దియోధర్ చెప్పారు. మోదీ ఆలోచలు, అభివృద్ధి పనులకు వాజపేయి ఆదర్శమని చెప్పారు. బీజేపీ అన్ని వర్గాలను అక్కున చేర్చుకునే పార్టీ అని తెలిపారు. మతతత్వ పార్టీగా బీజేపీని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి వాటికి మేము మా పని ద్వారా సమాధానం చెబుతామన్నారు.