భారతీయ జనతా పార్టీ నేత సోము వీర్రాజు తన ఎంఎల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారు. టిడిపి మిత్రపక్షంగా ఉన్నపుడు తనకు వచ్చిన ఎంఎల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు వీర్రాజే మీడియాతో చెప్పారు. టిడిపి ద్వారా సంక్రమించిన పదవులు తమకు అవసరం లేదని వీర్రాజు స్పష్టం చేశారు. అలాగే ఇతర నామినేటెడ్ పదవులను కూడా తమ నేతలు రాజీనామాలు చేస్తారని చెప్పారు. నిజానికి పదవుల కోసం బిజెపి నేతలు చాలా కాలంగా ఒత్తిడి తెస్తున్నా  చంద్రబాబునాయుడు వారికి పెద్దగా పదవులు ఇచ్చింది లేదు. అన్నీ ప్రతిపాదనలు పెండింగ్ లోనే ఉంచారు. మిత్రపక్షాలుగా ఉన్న టిడిపి-బిజెపి విడిపోవటంతోనే అందుకున్న అరోకొరా పదవులకు కూడా రాజీనామాలు చేస్తున్నారు. ఏపిఎన్ఎంఐడిసి ఛైర్మన్ పదవికి కూడా లక్ష్మీపతి రాజీనామా అందులో భాగమే.