బిజెపి సంచలనం: మంత్రులంతా డమ్మీలే

Bjp leader somu veerraju comments ministers has become dummies
Highlights

‘ప్రభుత్వాస్పత్రిలో 90 యంత్రాలు పని చేయడం లేదు. యంత్రాలు పని చేయకపోయినా సీఎం డాష్ బొర్డులో పనిచేస్తున్నట్లు నమోదైందని ఎద్దేవా చేశారు

రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో భయంకరమైన అవినీతి జరుగుతోందని బీజేపీ నేత సోము వీర్రాజు ఆరోపించారు. ఆయన శుక్రవారం కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాస్పత్రిలో 90 యంత్రాలు పని చేయడం లేదు. యంత్రాలు పని చేయకపోయినా సీఎం డాష్ బొర్డులో పనిచేస్తున్నట్లు నమోదైంది.

టీబీఎస్‌ సంస్థ పరికరాల మెయింటెనెన్స్ బాధ్యతలు టెండర్ ద్వారా తీసుకుంది. టీబీఎస్‌కు ఎక్కడా లేని విదంగా రూ.103 కోట్లు మొబిలైజేషన్‌ ద్వారా, బిల్లుల రూపేణా రూ. 45 కోట్లు చెల్లించారన్నారు. సదరు సంస్థ ఓ మంత్రి గారి బంధువుది కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నట్లు మండిపడ్డారు. టీబీఎస్‌ కాంట్రాక్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టాయిలెట్స్ నిర్మాణం, ఎన్ఆర్‌జీఎస్‌లో అవినీతిని బహిరంగపరుస్తామూటూ వీర్రాజు హెచ్చరించారు.

రాష్ట్రంలో పాలన మొత్తం తండ్రి, కొడుకుల చేతుల్లోనే ఉందని అందుకే మొగిలిన మంత్రులంతా డమ్మీలుగా మారారని విమర్శించారు. కేఈ, చిన్నరాజప్పలు కేవలం పేరుకే ఉప ముఖ్యమంత్రలని వారికి ఎలాంటి అధికారాల్లేవన్నారు. సీఎం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రాన్ని నిందిస్తున్నారని మండిపడ్డారు.

ప్యాకేజీపై ప్రధానిని గతంలో చంద్రబాబు అభినందించి, ఇపుడు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు ఎందుకు లాలూచీ పడుతున్నారని, సోనియాతో గాంధీతో ఎందుకు రహస్య మంతనాలు జరుపుతున్నారని మండిపడ్డారు.
 

 

loader