బీజేపీ మహిళా నేత, వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురందేశ్వరిని వైసీపీలో చేరాలంటూ ఆ పార్టీ అధిష్టానం ఒత్తిడి చేసిందంటూ గత కొంతకాలంగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ వార్తలపై పురందేశ్వరి తాజాగా స్పందించారు. ఈ వ్యవహారంపై  ప్రకాశం జిల్లాల్లో హాట్ హాట్ గా సమావేశాలు జరగడం... అది కాస్త దగ్గుబాటి వైసీపీకి రాజీనామా  చేసేదాకా మారింది. 

దీంతో ఈ వార్తలు మరింత హాట్ గా మారాయి. కాగా.... ఈ వార్తలపై తాజాగా పురందేశ్వరి స్పందించారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఆమె పర్యటించగా.. తొలిసారి ఈ విషయంపై స్పందించారు.

 AlsoRead వల్లభనేని వంశీ ఎఫెక్ట్, అఖిలప్రియ భర్తపై కేసు: జగన్ పై చంద్రబాబు భగ్గు

ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాలని ఆహ్వానం వచ్చింది. ఇప్పుడు నాకు ఎటువంటి ఆహ్వానం రాలేదు. వైసీపీలో చేరడానికి ముందు నా భర్త (దగ్గుబాటి వెంకటేశ్వరరావు).. నేను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టంగా ఆ పార్టీ నేతలకు చెప్పారు. అందుకు వైసీపీ నేతలు అంగీకరించిన తరువాతే నా భర్త, నా కుమారుడు ఆ పార్టీలో చేరారు. వైసీపీకి రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్న విషయాన్ని వెంకటేశ్వరరావును అడగండి’ అని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.

ఇటీవల పురందేశ్వరి టీడీపీ గురించి, తమ పార్టీ బీజేపీ గురించి కూడా మాట్లాడారు. కేంద్రంలో బీజేపీది చారిత్రాత్మక విజయమని  ఆ పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ఇంతటి ఘనవిజయం దేశ చరిత్రలో ఏ పార్టీకి రాలేదన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు అద్భుతమని కొనియాడారు. 

శనివారం పంజా సెంట్లరో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె పేదల సంక్షేమం కోసం ప్రధాని మోదీ అనేక పథకాలు తీసుకు వస్తున్నారని తెలిపారు. లింగబేధం లేకుండా సంక్షేమాన్ని అన్ని వర్గాలకు అందేలా మోదీ కృషి చేస్తున్నారని కొనియాడారు. 

ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబుపై  కీలక వ్యాఖ్యలు చేశారు పురంధీశ్వరి. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీని చంద్రబాబు నాయుడే అంగీకరించారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది కలలు కన్నారని, కానీ ఓటర్లు వారి కలలపై నీళ్లు చల్లారని ఎద్దేవా చేశారు. 

ఏపీకి బీజేపీ ఎంతో సహాయం చేసినా చంద్రబాబు తన సొంత మీడియా ద్వారా ఏమీ చేయలేదని ప్రచారం చేయించారని ఆరోపించారు. టీడీపీలో చంద్రబాబు తర్వాత ఎవరంటే లోకేష్‌ అని చెబుతారు కానీ బీజేపీలో మోదీ తర్వాత ఎవరూ ఉండరు అని అన్నారు.