చంద్రబాబు స్వయంకృత అపరాధం జగన్ కు కలిసొచ్చింది: బీజేపీ నేత మురళీధర్

First Published 15, May 2019, 5:35 PM IST
bjp leader muralidhar rao says ys jagan form government in ap
Highlights

 ప్రభుత్వ వ్యతిరేకత జగన్‌కు కలిసొచ్చే అంశంగా కనబడుతుందన్నారు. మరోవైపు తెలంగాణలో బీజేపీ బలోపేతానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే బీజేపీ బలోపేతం అయ్యేందుకు మరింత సమయం పడుతుందన్నారు. 

విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతారని స్పష్టం చేశారు. చంద్రబాబు స్వయంకృత అపరాధాలే ఆయన ఓటమికి కారణం అవుతాయని స్పష్టం చేశారు. 

విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన మురళీధర్ రావు ప్రభుత్వ వ్యతిరేకత జగన్‌కు కలిసొచ్చే అంశంగా కనబడుతుందన్నారు. మరోవైపు తెలంగాణలో బీజేపీ బలోపేతానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. 

అయితే బీజేపీ బలోపేతం అయ్యేందుకు మరింత సమయం పడుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభంజనం సృష్టించబోతున్నారంటూ జోస్యం చెప్పారు. ఇక దేశ వ్యాప్తంగా మోదీకి ప్రత్యామ్నాయం కనిపించే పరిస్థితి లేదన్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో తప్ప దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పెరిగిందన్నారు. ఈసారి కూడా 280కి పైగా స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ 75 స్థానాలకు మించి వచ్చే అవకాశాలు లేవని మురళీధర్ రావు స్పష్టం చేశారు. 

loader