వైసీపీలోకి మరో బీజేపీ నేత

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 5, Sep 2018, 2:56 PM IST
bjp leader indukuri raghuraju joins in ycp
Highlights

రఘురాజుతో పాటు 500 మంది నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. అంతకుముందు శృంగవరపు కోట నుంచి ఐదు వందల బైకులతో ర్యాలీగా వీరంతా పెందుర్తికి తరలివచ్చారు. 

వైసీపీలోకి వలసలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆనం లాంటి నేత రీసెంట్ గా పార్టీలో చేరగా.. మరో నేత రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సన్నాహం చేసుకున్నారు. తాజాగా.. మరో నేత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. భారతీయ జనతా పార్టీ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఇందుకూరి రఘురాజు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం వైఎసీపీలో చేరారు. 

విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. రఘురాజుతో పాటు 500 మంది నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. అంతకుముందు శృంగవరపు కోట నుంచి ఐదు వందల బైకులతో ర్యాలీగా వీరంతా పెందుర్తికి తరలివచ్చారు. విశాఖకు చెందిన ప్రముఖ వైద్యుడు, కళా ఆస్పత్రి అధినేత పైడి వెంకట రమణమూర్తి, పలువురు వైశ్యులు కూడా ఈ రోజు వైసీపీలో చేరారు

ఈ సందర్భంగా రఘురాజు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవడం తథ్యమని ఆయన పేర్కొన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌ వల్లే సాధ్యమన్నారు. బేషరతుగా వైఎస్సార్‌ సీపీలో చేరినట్టు తెలిపారు. ఎస్‌ కోట నియోజకవర్గాన్ని గెలిచి జగన్‌కు కానుకగా ఇస్తామన్నారు.

loader