హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం  ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నాలుగో దశ మార్గదర్శకాలను కూడ ఇందులో జత చేసింది.

మూడో విడత లాక్ డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగిసింది. నాలుగో విడత లాక్ డౌన్ ఇవాళ్టి నుండి ఈ నెలాఖరువరకు కొనసాగనుంది. నాలుగో  విడత లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది.

also read:కరోనా రోగి మృతదేహానికి అంత్యక్రియలను అడ్డుకొన్న కడప జిల్లా వాసులు

అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు కూడ కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే ఆయా రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారంతోనే బస్సుల రాకపోకలు కొనసాగించాలని ప్రభుత్వం సూచించింది.

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సోమవారం నాటికి కరోనా కేసులు 2282కి చేరుకొన్నాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. 

దేశంలో కరోనాను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా కు వైరస్ కు వ్యాక్సిన్ వచ్చే వరకు కొంత వరకు ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.