సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తామే కింగ్ మేకర్లమని కేసీఆర్, చంద్రబాబు పగటి కలలు కంటున్నారంటూ చెప్పుకొచ్చారు. తమ దగ్గర కింగ్ ఉండగా కింగ్ మేకర్ లతో తమకు పనేంటని నిలదీశారు. మిత్ర పక్షాలతో కలిసి బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రామ్ మాధవ్ ధీమా వ్యక్తం చేశారు.
ఢిల్లీ: భారతదేశ ప్రధానిగా మళ్లీ నరేంద్రమోదీ ఎన్నిక అవుతారని అందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. కచ్చితంగా బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
మోదీ కింగ్ అంటూ ఆయన అభివర్ణించారు. కేంద్రంలో అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాదని తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని అదంతా కల్ల అంటూ చెప్పుకొచ్చారు.