ప్రభుత్వం మళ్ళీ స్కూళ్ళకు దగ్గరలోనే మద్యం దుకాణాలకు అనుమతులిస్తోంది. ఈ విషయాన్ని సాక్ష్యాత్తు మిత్రపక్షం ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజే మంగళవారం చెప్పారు. తన నియోజకవర్గంలో స్కూళ్ళకు దగ్గర్లోనే మద్యం దుకాణాలున్నట్లు రాజుగారు చెప్పారు.
స్కూళ్ళకు దగ్గరలో వైన్ షాపులా? ఆమధ్య స్కూళ్ళ దగ్గరే మద్యం షాపులు పెడుతున్నారని, ఇళ్ళ మధ్య కూడా బార్లు, షాపులకు లైసెన్సులు ఇచ్చేస్తున్నారంటూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేసారు గుర్తుందా? కొద్ది రోజుల పాటు మౌనంగా ఉన్న ప్రభుత్వం మళ్ళీ స్కూళ్ళకు దగ్గరలోనే మద్యం దుకాణాలకు అనుమతులిస్తోంది. ఈ విషయాన్ని సాక్ష్యాత్తు మిత్రపక్షం ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజే మంగళవారం చెప్పారు. తన నియోజకవర్గంలో స్కూళ్ళకు దగ్గర్లోనే మద్యం దుకాణాలున్నట్లు రాజుగారు చెప్పారు.
తన నియోజకవర్గంలో 13 బార్లు, 14 లిక్కర్ షాపులున్నాయట. అందులో 8 లిక్కర్ షాపులను ఎత్తేయాలని చంద్రబాబుకునాయుడుకు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. పైగా తానిచ్చిన వినతిపత్రాలను చెత్త బుట్టలో పడేస్తున్నట్లు కూడా రాజుగారు మండిపడుతున్నారు. విశాఖపట్నం జిల్లాలో ఎక్సైజ్ సూపరెండెంట్ అడ్డుకుంటున్నా లిక్కర్ మాఫియా అమరావతి నుండి ఆదేశాలు ఇప్పించుకుని లైసెన్సులు తెచ్చుకుంటున్నారని కూడా ఆరోపించారు. మిత్రపక్షమై ఉండి కూడా రాజుగారి పరిస్ధితి చివరకు ప్రతిపక్షం పరిస్ధితి అయిపోయింది పాపం.
