టిడిపికి ఊహించని షాక్ తగిలింది. మిత్రపక్షం భాజపా నుండే ఫిరాయింపు ఎంఎల్ఏలు, మంత్రుల విషయంలో పెద్ద ప్రతిఘటన ఎదురైంది. భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఫిరాయింపు మంత్రులు, ఎంఎల్ఏలపై తక్షణమే వేటు వేయాలంటూ డిమాండ్ చేశారు. మిత్రపక్షం నుండి ఇటువంటి డిమాండ్ వస్తుందని టిడిపి ఊహించలేదు. దాంతో విష్ణు డిమాండ్ పై ఏ విధంగా స్పందిచాలో టిడిపి నేతలకు అర్ధం కావటం లేదు. అసెంబ్లీ లోని వైసిపి కార్యాలయంలో విష్ణు పిఏసి ఛైర్మన్, వైసిపి ఎంఎల్ఏ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డితో కలిసి ఫిరాయింపులపై వేటుకు డిమాండ్ చేయటం విచిత్రంగా ఉంది.

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటమే తప్పన్నారు. అంటే నేరుగా చంద్రబాబునాయుడునే భాజపా ఫ్లోర్ లీడర్ తప్పు పట్టినట్లైంది. ఏదో ఎంఎల్ఏలుగా ఫిరాయింపులను ప్రోత్సహించారంటే సరేలే అని సరిపెట్టుకున్నా వారిని ఏకంగా మంత్రులను చేయటమేంటని చంద్రబాబును నిలదీశారు. తాము మొదటి నుండి కూడా ఫిరాయింపులకు వ్యతిరేకమనే చెప్పారు. ప్రతిపక్ష ఎంఎల్ఏలను మంత్రులను చేయటం దారణంగా చెప్పారు. తక్షణమే వారిచేత రాజీనామాలు చేయించాలని లేకపోతే వేటు వేయాలంటూ డిమాండ్ చేశారు. లేకపోతే ఏ పార్టీ తరపున ఎంఎల్ఏగా గెలిచినా మంత్రిని చేయవచ్చనే కొత్త చట్టం చాయాలంటూ చంద్రబాబును ఎద్దేవాచేశారు.