Asianet News TeluguAsianet News Telugu

తిరుపతి ఉప ఎన్నిక: రత్నప్రభ వైపే బీజేపీ మొగ్గు, అధికారిక ప్రకటన

త్వరలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు తమ పార్టీ అభ్యర్ధిగా విశ్రాంత ఐఏఎస్ రత్నప్రభను అధికారికంగా ప్రకటించింది భారతీయ జనతా పార్టీ.

BJP finalises name of former IAS officer Ratna Prabha as candidate for tirupati by poll ksp
Author
Tirupati, First Published Mar 25, 2021, 9:30 PM IST

త్వరలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు తమ పార్టీ అభ్యర్ధిగా విశ్రాంత ఐఏఎస్ రత్నప్రభను అధికారికంగా ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. 

గతంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆమె రిటైరయ్యారు. డిప్యూటేషన్‌పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ సెక్రటరీగా కూడ ఆమె పనిచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైరైన తరవాత ఆమె బీజేపీలో చేరారు.

ఏపీలో పనిచేసిన అనుభవం ఉండడంతో రత్నప్రభను తిరుపతి ఎంపీ స్థానం నుండి బరిలోకి దింపాలని బీజేపీ నాయకత్వం ప్లాన్ చేసింది. రత్నప్రభ కంటే ముందుగా మరో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి పేరును కూడ బీజేపీ నాయకత్వం పరిశీలించింది. చివరికి రత్నప్రభ వైపే బీజేపీ మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది.

గత ఏడాదిలో అనారోగ్యంతో తిరుపతి ఎంపీ  బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ స్థానం నుండి పోటీ చేసే టీడీపీ, వైసీపీ అభ్యర్ధులను ఆ పార్టీ అధిష్టానాలు ఇప్పటికే ప్రకటించాయి.  టీడీపీ నుండి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, వైసీపీ నుండి డాక్టర్ గురుమూర్తిలు బరిలోకి దిగనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios