విజయనగరం: ఏపీలో రాక్షస పాలన సాగుతోందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు  సోము వీర్రాజు విమర్శించారు.

గురువారం నాడు ఆయన విజయనగరం  జిల్లా రామతీర్థం వద్ద మీడియాతో మాట్లాడారు. 

వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డిని అనుమతి ఇచ్చి తమకు  ఎందుకు అనుమతివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.  ఎన్ని అరెస్టులు జరిగినా కూడ ఇక్కడి నుండి కదిలేదని ఆయన చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.  గత ఏడాది డిసెంబర్ మాసంలో  రామతీర్థంలో రాముడి విగ్రహన్ని ధ్వంసం చేశారు. 

also read:రామతీర్థంలో ఉద్రిక్తత: పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట, సొమ్మసిల్లిన సోమువీర్రాజు

ఈ ఘటనను నిరసిస్తూ  బీజేపీ నేతలు, కార్యకర్తలు  గురువారం నాడు రామతీర్థం వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే రామతీర్థం జంక్షన్ వద్ద బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకొన్నారు. పోలీసులతో జరిగిన తోపులాటలో బీజేపీ నేతలు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లు సొమ్మసిల్లి పడ్డారు.