వైసీపీనే ప్రధాన ప్రత్యర్ధి, రాష్ట్ర నేతలకు క్లాస్: అమిత్ షాతో ఏపీ బీజేపీ నేతల భేటీ
బీజేపీకి చెందిన ఏపీ రాష్ట్ర ముఖ్య నాయకులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీని బలోపేతం చేసే విషయమై చర్చించారు.
అమరావతి: 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్ర అమిత్ షా పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. అంతేకాదు కొందరు పార్టీ నేతలకు అమిత్ షా క్లాస్ తీసుకొన్నారని సమాచారం. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు తిరుపతి వచ్చినఅమిత్ షాతో బీజేపీకి చెందిన ఏపీ రాష్ట్ర ముఖ్య నాయకులు భేటీ అయ్యారు.రాష్ట్రంలో తమ ప్రధాన ప్రత్యర్ధి వైసీపీ అని బీజేపీ నేతలకు Amit shah షా తేల్చి చెప్పారు. మరో వైపు Amaravatiని ఏపీ రాజధాని అనే స్టాండ్ కు బీజేపీ కట్టుబడి ఉన్నందున నేతల మధ్య బేదాభిప్రాయాలు ఉన్న విషయమై అమిత్ షా ఆరా తీశారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అమిత్ షా పార్టీ నేతలకు తేల్చి చెప్పారు.జనసేన పార్టీతో కలిసి 2024లో ఏపీ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని అమిత్ షా పార్టీ నేతలకు సూచించారు.ఈ దిశగా కార్యాచరణ సిద్దం చేసుకోవాలని ఆయన పార్టీ నేతలను కోరారు.జనసేనతో కలిసి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై అమిత్ షాతో బీజేపీ నేతలు చర్చించారు. బీజేపీ నేతలకు అమిత్ షా క్లాస్ ఇచ్చినట్టుగా సమాచారం.
వైసీపీ పాలన గురించి బీజేపీ నేతలు అమిత్ షా కు వివరించారు. ప్రజల సమస్యలను ఏకరువు పెట్టారు.మరో వైపు ఏపీ విభజన బిల్లుపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో tdp, ycpకి సమాన దూరం పాటించాలని అమిత్ షా పార్టీ నేతలకు సూచించినట్టుగా సమాచారం. ప్రజల సమస్యలపై పోరాటాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణాభివృద్దికి సహకరిస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ నేతల దృష్టికి తీసుకొచ్చారు.
also read:ప్రత్యేక హోదా విస్మరించారు, విభజన హమీలు అమలు కాలేదు: సదరన్ జోనల్ కౌన్సిల్‌లో జగన్
ఈ సమావేశం ముగిసిన తర్వాతbjpఏపీ రాష్ట్ర అధ్యక్షుడు Somu Veerraju మీడియాతో మాట్లాడారు.2024లో రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించినట్టుగా చెప్పారు. ఇవాళ జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరగడం లేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాల గురించి కూడా చర్చించామని సోము వీర్రాజు తెలిపారు.దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై బీజేపీ కన్నేసింది. వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ మెరుగైన ఫలితాలను సాధించింది. అయితే ఏపీ రాష్ట్రంలో మాత్రం బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. జనసేనతో పొత్తు ఆ పార్టీకి కలిసి వస్తోందని కమలనాథులు భావిస్తున్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీకి జనసేన దూరంగా ఉంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు.స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన రాష్ట్రంలోని పలు చోట్ల టీడీపీతో పొత్తు పెట్టుకుంది. స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పొత్తులు పెట్టుకొన్నారని రెండు పార్టీల నేతలు ప్రకటించారు.