మైండ్ గేమ్ రాజకీయాలకు చెక్ పెడతాం: బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైండ్ గేమ్ రాజకీయాలకు తాము చెక్ పెడతామని బీజేపీ ఏపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు చెప్పారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

BJP AP Chief Somu Veerraju Comments on Janasena Chief Pawan Kalyan Comments

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైండ్ గేమ్ రాజకీయాలకు చెక్ పెడతామని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు.బీజేపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను బుధవారం నాడు విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహించారు.

విజయవాడ రాఘవయ్య పార్క్ వద్ద వివేకానంద విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పూలమాలలు వేసిన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా   సోమువీర్రాజు మాట్లాడారు.

మా మిత్ర పక్షం నాయకులు నిన్న కార్యకర్తల సమావేశంలో మైండ్ గేమ్ రాజకీయాలు ఏపీలో నడుస్తున్నాయని చెప్పారని Somu Veerraju గుర్తు చేశారు. అటువంటి మైండ్ గేమ్ రాజకీయాలకు బీజేపీ చెక్ పెడుతుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది మోదీనే అని  ఆయన అన్నారు. ఏపీని అభివృద్ధి చేయటానికి బీజేపీ, జనసేనలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని సోమువీర్రాజు హమీ ఇచ్చారు.

Andhra pradesh రాష్ట్రంలో ఇటీవల కాలంలో పార్టీల మధ్య పొత్తుల విషయం చర్చ సాగుతుంది. చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన సందర్భంగా ఆ పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు జనసేనతో పొత్తు విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఈ సమయంలో  వన్ సైడ్ ప్రేమ గురించి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. మరునాడే మీడియా సమావేశంలో వన్ సైడ్ ప్రేమ గురించి Chandrababu వివరించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులతో పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. తమ పార్టీ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొన్న సమయంలో విజయం సాధించడంతో పాటు ఓటమి పాలైన సందర్భాలు కూడా ఉన్నాయని చంద్రబాబు గుర్తు చేశారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై  Janasena చీఫ్ Pawan Kalyanమంగళవారం నాడు స్పందించారు.  పార్టీ కార్యకర్తలతో జనసేన చీఫ్ టెకలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో పొత్తుల విషయమై ఆయన స్పందించారు. మైండ్ గేమ్ రాజకీయాలు నడుస్తున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీ కార్యకర్తలతో చర్చించిన మీదటే పొత్తులపై నిర్ణయం తీసుకొంటామని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత ఏపీ రాష్ట్రంలో Bjp, జనసేన మధ్య పొత్తు కుదిరింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు తమ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని  ఈ రెండు పార్టీలు ప్రకటించాయి.  

అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికంగా ఉన్న పరిస్థితుల మేరకు Tdp, జనసేన మధ్య కూడా పొత్తు కుదిరింది. కొన్ని స్థానాలను ఈ రెండు పార్టీలు కలిసి కైవసం చేసుకొన్నాయి. దీంతో జనసేన, టీడీపీ మధ్య మళ్లీ పొత్తు కుదిరే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగింది. అయితే దీనికి బలం చేకూరేలా గత ఏడాది చివర్లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, left పార్టీలు కూటమిగా పోటీ చేస్తాయని చెప్పారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios