భరత నాట్యంలో జూనియర్ ఎన్టీఆర్ కు మంచి ప్రావీణ్యం: గురుపూజోత్సవంలో సోము వీర్రాజు

గురు పూజోత్సవంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ప్రస్తావించారు. బాల రామాయణంలో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారన్నారు. 

BJP AP Chief Somu Veerraju  Appreciates junior NTR Acting


విజయవాడ:సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును గురుపూజోత్సవం కార్యక్రమంలో బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ప్రస్తావించారు. సోమవారం నాడు విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తన ప్రసంగంలో జూనియర్ ఎన్టీఆర్ పేరును సోము వీర్రాజు ప్రస్తావించారు. జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడన్నారు బాల రామాయణంలో జూనియర్ అద్భుతంగా నటించాడని సోము వీర్రాజు గుర్తు చేసుకున్నారు. ఇదే జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమాగా ఆయన పేర్కొన్నారు. భరత నాట్యం గురించి ఎన్టీఆర్ కు బాగా తెలుసునన్నారు. భరత నాట్యం చిన్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్  నేర్చుకొన్నాడన్నారు.

జూనియర్ ఎన్టీఆర్  మంచి ప్రజాదరణ ఉన్న నటుడని నిన్న సోము వీర్రాజు చెప్పారు. రాజమండ్రిలో మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవసరమైన చోట జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకొంటామన్నారు.

ఈ ఏడాది ఆగష్టు 21న హైద్రాబాద్ శంషాబాద్ లోని ఓ హాటల్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. ఇటీవల వచ్చిన సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ నటనను చూసి ఆయనను అభినందించేందుకు ఈ భేటీ ఉద్దేశించిందని కొందరు  బీజేపీ నేతలు ప్రకటించారు మరికొందరు నేతలు మాత్రం రాజకీయ చర్చలు జరిగి ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేమన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. 
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకొనే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఇటీవల కాలంలో బీజేపీ నేతల ప్రకటనలు చూస్తే ఇదే అర్ధమౌతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఖమ్మంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించారు.

also read:అవసరమైన చోట జూ. ఎన్టీఆర్ సేవలు వినియోగించుకొంటాం: బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు

ఖమ్మంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని హైద్రాబాద్ వెళ్తుండగా మోతె వద్ద రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డాడు. ఆసుపత్రి బెడ్ పై ఉండి కూడా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించలేదు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios