అమరావతి:  జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్‌‌పై టీడీపీ నేతల విమర్శలు తగ్గినట్టు కన్పిస్తున్నాయని బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు  చెప్పారు. పవన్ గాలి కూడ మారిందేమోనని  ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు.

సోమవారం నాడు  బీజేపీ శాసనసభపక్షనేత విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడారు.  పవన్ కళ్యాణ్‌‌పై టీడీపీ నేతలు విమర్శలను తగ్గించారని ఆయన గుర్తు చేశారు. బీజేపీతో పవన్ కళ్యాణ్ చేతులు కలిపారని  టీడీపీ నేతలు విమర్శలు చేసేవారని ఆయన గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం పవన్‌పై విమర్శల జోరును టీడీపీ తగ్గించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు  పవన్ కళ్యాణ్‌కు కూడ టీడీపీపై  కొంత మార్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు.  మోడీ చేతిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పినవాళ్లంతా ఇప్పుడంతా  కొత్త ట్విస్టులు ఇస్తున్నారన్నారు. ట్విస్ట్‌లు, యూ టర్న్‌లు అధికార పార్టీకి కొత్తేమీ కాదని  చెప్పారు.