ఎన్నికలు మరో నెల రోజుల్లో ఉండగా.. కడప జిల్లాలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటనకు వెళ్లిన మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్‌రెడ్డిని మహిళలు అడ్డుకున్నారు.

 జమ్మలమడుగు మండలంలోని దేవగుడి, పి.సుగుమంచిపల్లె గ్రామాలకు వెళ్లిన వైసీపీ నేతలను తమ గ్రామాల్లోకి రావొద్దంటూ ప్రజలు అడ్డుకున్నారు. ఈ ఐదేళ్లలో మీరెవరైనా ఎప్పుడైనా గ్రామానికి వచ్చారా? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఇప్పుడు మమ్మల్ని చూసేందుకు వస్తున్నారు.. అంటూ వారిపై మండిపడ్డారు.

వైసీపీ నేతలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా.. ఫలితం కనపడలేదు. దీంతో.. గ్రామస్థులను ఎదురించలేక.. అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డిలు ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి వెనుదిరిగారు.