మాజీ మంత్రి నారాయణకు చేదు అనుభవం ఎదురైంది.  మంగళవారం నారాయణ అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లారు. కాగా... అక్కడ ఆయనను పలు విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. 

నారాయణ పర్యటనను వ్యతిరేకిస్తూ ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నారాయణ కాలేజీల్లో ఫీజుల పేరుతో వేధిస్తున్నారని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం నేత ఆవుల రాఘవేంద్ర.. నారాయణ షర్ట్ కాలర్ పట్టుకున్నారు. 

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న విద్యా సంస్థలను మూసివేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఈ ఘటనకుసంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.