ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిశ్వభూషణ్ గవర్నర్‌గా ప్రమాణం చేశారు.

గవర్నర్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏపీ రాష్ట్ర నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ గా ప్రమాణం చేశారు.

ఈ నెల 16వ తేదీన బిశ్వభూషణ్ ను ఏపీకి కొత్త గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్న నరసింహాన్  ప్రస్తుతం తెలంగాణకు మాత్రమే గవర్నర్ గా కొనసాగుతారు. ఏపీ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ కొనసాగుతారు.

యూపీఏ ప్రభుత్వంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి నరసింహాన్ గవర్నర్‌గా నియమితులయ్యారు.  కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం స్థానంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ నరసింహాన్  కొనసాగారు.

బిశ్వభూషణ్ హరిచందన్ 1971లో ఆయన జనసంఘ్ లో చేరారు.ఆ తర్వాత 1988లో  బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా కూడ ఆయన పనిచేశారు. ఐదు దఫాలు సిలికా నుండి ఆయన ఎమ్మెల్యేగా  ప్రాతినిథ్యం వహించారు. ఒడిశా మంత్రిగా కూడ పనిచేశారు.న్యాయవాదిగా కూడ పనిచేశారు.  పలు పుస్తకాలు రాశారు.

ఏపీ రాష్ట్రంలో బీజేపీ బలపడాలని భావిస్తోంది.ఈ తరుణంలో ఇతర పార్టీల నుండి  బీజేపీలోకి  వలసలను ప్రోత్సహిస్తోంది.వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ రాష్ట్రానికి  కొత్త గవర్నర్ ను నియమించడం రాజకీయంగా ఆసక్తిని కల్గిస్తోంది.