ఏపీలో ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. దీంతో అన్ని పార్టీల అదిష్టానాలు అభ్యర్థుల జాబితాపై దృష్టి కేంద్రీకరించాయి.  ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే... పార్టీ గెలుస్తుందనే దానిపై సర్వే చేయించి మరీ.. టికెట్లు కేటాయిస్తున్నారని సమాచారం. కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఇటీవల ఓ టీవీ ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ షో2 విన్నర్ గా నిలిచిన కౌశల్.. ఈ ఎన్నికల బరిలో టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.

అనకాపల్లి నియోజకవర్గాన్ని కాపు సామాజిక వర్గానికి కేటాయిస్తే..బాగుంటుందని టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారట. దీంతో.. కౌశల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా.. ఈ టికెట్ ఆశిస్తుండగా.. కౌశల్ కూడా పోటీకి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.