నా భర్త ఐదు కిలోల బరువు తగ్గారు.. ఆందోళనగా ఉంది.. భువనేశ్వరి
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. జైలు అధికారులు, వైద్యులు వాస్తవాలు చెప్పకుండా దాస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.
రాజమండ్రి : స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్టై జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ‘నా భర్త జైలులో ఉన్న సమయంలో ఆయనకు అత్యవసరంగా అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైనందున, నా భర్త క్షేమం గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. అతను ఇప్పటికే 5 కిలోల బరువు కోల్పోయాడు.
ఇంకా ఏదైనా బరువు తగ్గితే ఆయన మూత్రపిండాల మీద తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులన్నారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. ఈ భయంకరమైన పరిస్థితులు నా భర్తకు తీవ్రముప్పు తలపెట్టేలా ఉన్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ కోసం కట్టే భవనాల్లో.. కమోడ్ ధర రూ.25 లక్షలు, కుళాయి రూ. 6 లక్షలు...
తండ్రి ఆరోగ్య పరిస్థితిపై నారా లోకేష్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆరోగ్యపరిస్థితి తీవ్ర ముప్పు పొంచిఉంది. ఆయన రక్షణ ప్రశ్నార్థకంగా తయారయ్యింది. నిజాలను డాక్టర్లు, జైలు సిబ్బంది చెప్పకుండా దాస్తున్నారు. చంద్రాబాబుకు ఏదైనా హాని కలిగితే వైఎస్ జగన్ దే బాధ్యత అన్నారు.
నారా బ్రాహ్మిణి కూడా మామగారి ఆరోగ్యం విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. చంద్రబాబుగారు ప్రస్తుతం అపరిశుభ్రమైన జైలు పరిస్థితులలో నిర్బంధించబడ్డారు. ఆయన ఆరోగ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. వైద్య నిపుణులతో తక్షణ వైద్య సహాయం అవసరం అన్నారు. చంద్రబాబుగారికి సకాలంలో వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.