వైపీపీ ఓట్లు తొలగించేందుకు డేటా చౌర్యం: పెగాసెస్ హౌస్ కమిటీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి
వైసీపీకి చెందిన ఓటర్లను తొలగించేందుకు ఆనాడు చంద్రబాబు సర్కార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తుల డేటాను చౌర్యం చేసిందని పెగాసెస్ పై ఏర్పాటు చేసిన శాసనసభ కమిటీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.
అమరావతి: chandrababu ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన YCP అనుకూలమైన సుమారు 35 నుండి 40 లక్షల ఓట్లను తొలగించేందుకు గాను డేటా చౌర్యం చేసిందని పెగాసెస్ పై ఏపీ ప్రభుత్వం నియమించిన శాసనసభసంఘం చైర్మెన్ Bhumana Karunakar Reddy,చెప్పారు.
Pegasus పై ఏర్పాటు చేసిన AP Assembly House Committee చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో కమిటీ బుధవారం నాడు కూడా సమావేశమైంది.ఈ సమావేశం తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సర్కార్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేసే ప్రయత్నం చేశారని చెప్పారు.ఆనాడు విపక్షంలో ఉన్న వైసీపీకి చెందిన ఓటర్లను తొలగించేందుకు కుట్ర పన్నారన్నారు.
ఆనాడు ప్రభుత్వ పెద్దలు ఈ డేటా చౌర్యం వెనుక ఉన్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా ఇది సాధ్యం కాదన్నారు. డేటా చౌర్యానికి సంబంధించి నాలుగు రోజులుగా లోతుగా విచారణ చేశామన్నారు. ఈ విషయమై అధికారులతో కూడా మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు. కిందిస్థాయి ఉద్యోగులు డేటా చౌర్యం చేసే ధైర్యం చేయబోరన్నారు. దీనికి వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్నారు. ఓట్లను తొలగించి రాజకీయంగా లబ్దిపొందేందుకు చంద్రబాబు సర్కార్ ప్రయత్నించిందన్నారు. ఆనాడు సేవామిత్ర యాప్ ద్వారా ప్రజలకు ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయమై సర్వే చేసి ఓటర్ల మనోభావాలను తెలుసుకొన్నారు. టీడీపీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగించేందుకు seva mitra ను ఉపయోగించుకొన్నారని ఆయన ఆరోపించారు.ఈ విషయమై ఆనాడు జరిగిన ఘటనలను ఆయన గుర్తు చేశారు.
డేటా చౌర్యానికి సంబంధించి telangana ప్రభుత్వం కూడా SIT ఏర్పాటు చేసి విచారణ చేసిందన్నారు. అయితే టీడీపీకి సంబంధించిన ఓటర్ల సమాచారాన్ని దొంగిలించారని ఈ విషయమై విచారణకు చంద్రబాబు సర్కార్ కూడా సిట్ ఏర్పాటు చేసిత తాము చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేశారన్నారు.