‘సాక్ష్యాలు ఉన్నా.. చంద్రబాబుపై కేసు పెట్టరు’

bhumana karunakar fire on chandrababu over note for vote
Highlights

మళ్లీ తెరపైకి  ఓటుకి నోటు.. చంద్రబాబుపై ఫైరైన భూమన

‘ ఓటుకి నోటు’ కేసు చంద్రబాబుని వదిలిపెట్టేలా లేదు. ఆ మధ్య సమసిపోయిందిలే అనుకున్న ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో చంద్రబాబు ప్రధాన నిందితుడు అనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసు విషయంలో ప్రతిపక్ష నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు.

బుధవారం ఈ కేసు విషయంపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్టీఫెన్ సన్ తో ఫోన్ లో మాట్లాడిన గొంతు చంద్రబాబుదేనని భూమన తెలిపారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా ఆయనపై ఇప్పటివరకు కేసు ఎందుకు పెట్టరు అని ప్రశ్నించారు. ఈ ఓటుకు నోటు కేసులో దొరికినందుకే చంద్రబాబు నాలుగు సంవత్సరాల పాటు మోదీ ప్రభుత్వాన్ని భుజాలపై మోసారన్నారు. ఈ కేసులో మోదీ తనను కాపాడతారనే దీమాతో ఇన్నాళ్లు చంద్రబాబు ఉన్నారని ఆయన అన్నారు.

తాజాగా.. ఈ కేసును తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్లీ తెరపైకి తీసుకువచ్చారనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా భూమా చర్చించారు. ఈ కేసులో నిజమైన దోషులను బయటకు లాగాలని ఆయన డిమాండ్ చేశారు.

loader