ఆళ్ళగడ్డ: ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ వివాహాం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.  లారీ నిండా పెళ్లి పత్రికలను ముద్రించారు.ఈ ఆహ్వాన పత్రికలను  పంచుతున్నారు.ఆగష్టు 29వ తేదీన  మంత్రి భూమా అఖిలప్రియ వివాహం జరగనుంది.

ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ వివాహం  ఆగష్టు 29వ తేదీన ఆళ్లగడ్డలోని భూమా శోభా నాగిరెడ్డి  ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతోంది. ఈ వివాహానికి సుమారు 30 వేల మంది హాజరుకానున్నట్టు  కుటుంబసభ్యులు అంచనావేస్తున్నారు.

ఇప్పటికే  గవర్నర్ నరసింహాన్‌తో పాటు పలువురు వీవీఐపీలకు  ఆహ్వనపత్రికలను అందించారు. అయితే  గత వారం రోజుల క్రితం లారీ నిండా ఆహ్వానపత్రికలు ఆళ్లగడ్డకు చేరుకొన్నాయి.

భూమా కుటుంబసభ్యులు ఈ వివాహానికి  ఎవరెవరిని ఆహ్వానించాలనే విషయమై ఇప్పటికే జాబితాను సిద్దం చేశారు.  ఈ జాబితా ఆధారంగా కుటుంబసభ్యులు  కార్డులను పంచుతున్నారు.

మరోవైపు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రతి  గ్రామంలోని ప్రతి ఒక్కరికీ కార్డును పంచేలా భూమా కుటుంసభ్యులు ప్లాన్ చేస్తున్నారు.  ఇదిలా ఉంటే ఈ వివాహానికి సుమారు 30 వేల మంది హాజరౌతారని భూమా కుటుంబసభ్యులు అంచనావేస్తున్నారు. 

 భూమా శోభా నాగిరెడ్డి బంధువులు,స్నేహితులు , ఇప్పటివరకు ఆయనతో  వెన్నంటి ఉన్న అనుచరులు, కార్యకర్తలందరికీ ఆహ్వానపత్రికలు అందేలా కుటుంబసభ్యులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

నంద్యాల, ఆళ్లగడ్డ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రతి ఒక్కరికీ  పెళ్లి పత్రిక అందేలా  జాగ్రత్తలు తీసుకొంటున్నారు. భూమా శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిలు ఆళ్లగడ్డ, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ప్రాతినిథ్యం వహించారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన వారిని పిలవాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఏపీ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ సమీప బంధువు భార్గవ్ తో ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి భూమా అఖిలప్రియ వివాహం జరగనుంది. ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. 

రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున వీవీఐపీలు, వీఐపీలు, రాజకీయ పార్టీల ప్రముఖులు ఈ వివాహానికి వచ్చే అవకాశం ఉన్నందున  భారీ ఎత్తున  ఏర్పాట్లు చేస్తున్నారు.  

గోవా నుండి ప్రత్యేకంగా  ఈవెంట్ మేనేజ్‌మెంట్ టీమ్ ఆళ్లగడ్డకు చేరుకొంది. మంత్రి అఖిలప్రియ వివాహం ఏర్పాట్లను ఈ టీమ్ చూస్తోంది. మరోవైపు భూమా అఖిలప్రియ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లను ఆమె మేనమామ ఎస్వీ మోహాన్ రెడ్డి, తాత, మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

ఈ వార్తలు చదవండి

భూమా దంపతుల ఫోటోలతో అఖిలప్రియ పెళ్లి పత్రిక

ఈ నెల 29నే మంత్రి అఖిలప్రియ వివాహం