ఈ నెల 29నే మంత్రి అఖిలప్రియ వివాహం

First Published 8, Aug 2018, 10:15 AM IST
ap minister akhila priya marriage date fixed
Highlights

మే నెలలో అఖిల ప్రియ నిశ్చితార్థం మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త భార్గవ్ తో కుటుంసభ్యుల నడుమ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ వివాహం ఈ నెల 29న ఉదయం 10:57 గంటలకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో జరగనుంది. ఈ మేరకు వివాహ ఆహ్వాన పత్రికలను మంత్రి కుటుంబ సభ్యులు ఆహుతులకు అందజేస్తున్నారు. 

ఇందులో భాగంగా మంత్రి అఖిలప్రియ తన సోదరి నాగమౌనిక, సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో మంగళవారం హైదరాబాద్‌లో తెలుగురాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను ఇచ్చి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటాన్ని మంత్రి గవర్నర్‌కు అందజేశారు. అనంతరం తెలంగాణ పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను కలిసి వివాహానికి ఆహ్వానించారు.

మే నెలలో అఖిల ప్రియ నిశ్చితార్థం మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త భార్గవ్ తో కుటుంసభ్యుల నడుమ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

loader