ఆళ్లగడ్డ:ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ వివాహాం ఈ నెల 29వ తేదీన జరగనుంది.  ఈ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల ఫోటోలు  ముద్రించారు.  ఈ ఫోటోలతో ఆహ్వనపత్రికలో ఆకర్షణీయంగా ఉన్నాయి.

ప్రముఖ పారిశ్రామికవేత్త మాధుర్ భార్గవ రామ్ నాయుడితో ఈ నెల 29వ తేదీన  ఉదయం 10.57 గంటలకు వివాహం జరగనుంది. ఆళ్లగడ్డలోని భూమా శోభా నాగిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో  వివాహం కోసం భూమా కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నెల 29నే మంత్రి అఖిలప్రియ వివాహం

సెప్టెంబర్ 1వ తేదీన  హైద్రాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో  రిసెప్షన్ జరగనుంది. మంత్రి అఖిలప్రియ వివాహనికి సంబంధించిన ఇన్విటేషన్లను కుటుంబసభ్యులు పంచుతున్నారు.

వివాహ సమయం దగ్గరపడడంతో ఏర్పాట్లలో కుటుంబసభ్యులు తీరికలేకుండా ఉన్నారు.  ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వానపత్రికలను పంపిణీ దాదాపుగా పూర్తైనట్టు సమాచారం. ఈ వివాహానికి భూమా అభిమానులు కూడ పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో  ఏర్పాట్లను పెద్ద ఎత్తున చేస్తున్నారు.