మాజీ డీజీపీ సాంబశివరావు కు అత్యంత సమీప బంధువుతో
మాజీ డీజీపీ సాంబశివరావు కు అత్యంత సమీప బంధువుతో అఖిల ప్రియ ఎంగేజ్ మెంట్ జరిగింది
భూమా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.
త్వరలోనే వీరి వివాహం జరగనున్నది. అఖిల ప్రియ కు గతంలోనే పెళ్లి అయింది
వై.ఎస్ జగన్ మేనమామ రవీంధర్ రెడ్డి కుమారుడితో అత్యంత ఘనంగా భూమా నాగిరెడ్డి ,శోభా నాగిరెడ్డి వివాహం జరిపించారు .అయితే పెళ్లి అయిన కొద్ది రోజులకే వీరి మధ్య విభేదాలు వచ్చాయి.
దీంతో అఖిలప్రియ విడాకులు తీసుకున్నారు .ఆ తర్వాత భూమా కుటుంబంలో అనుహ్యా పరిణామాలు చేసుకున్నాయి. శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఆ తర్వాత భూమా నాగిరెడ్డి గుండె పోటుతో ప్రాణాలు వదిలారు దీంతో అఖిల ప్రియ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.
ఆళ్ళగడ్డ ఉప ఎన్నికల్లో గెలిచిన ఆమె ప్రస్తుతం చంద్రబాబునాయుడి మంత్రి వర్గంలో టూరిజం మినిస్టర్ గా వ్యవహారిస్తున్నారు


బంధువులు, మిత్రుల మధ్య అఖిలప్రియ నిశ్చితార్థం జరిగింది. ఆగష్టు 29 వ తేదీన భార్గవ్ తో వివాహం జరుగుతుందని సమాచారం.
